నదిలో దూకిన తల్లి.. పిల్లల ఆర్తనాదాలు విని..

Woman Trying To Take Own Life By Jumping Into River In East Godavari - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ సంఘటన జిల్లాలోని తాళ్లరేవు మండలంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మేరకు.. కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ చనిపోవటానికి నిశ్చయించుకుంది. శనివారం తన ఇద్దరు పిల్లలతో కలిసి తాళ్లరేవు మండలం కోరంగి బ్రిడ్జి వద్దకు చేరుకుంది. అనంతరం బ్రిడ్జిపైనుండి గోదావరి నదిలోకి దూకింది. ( మహిళ పిచ్చి పని.. పోలీసుల నుంచి తప్పించుకోవటానికి )

తల్లి నదిలోకి దూకటంతో భయాందోళనలకు గురైన పిల్లలు ఆర్తనాదాలు చేయటం మొదలుపెట్టారు. వారి అరుపులు విన్న స్థానికులు, వాహనదారులు అక్కడకు చేరుకున్నారు. ఆ వెంటనే మహిళను క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న కోరంగి పోలీసులు విచారణ చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top