లైంగిక వేధింపులు..ఆపై కాల్పులు

అభ్యంతరం చెప్పిన వ్యక్తిపై కాల్పులు
లక్నో: మహిళలపై పోలీస్ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని అజమ్‌గర్‌లో చోటుచేసుకుంది. రోడ్డుపైనే చిత్తుగా తాగడమే కాకుండా మహిళల పట్ల అసభ్యప్రవర్తించాడు సదరు పోలీస్ అధికారి. అంతటి ఆగకుండా అతని ప్రవర్తనను అడ్డుకున్న కిషన్ లాల్ అనే వ్యక్తిపై ఆ అధికారి కాల్పులకు పాల్పడ్డాడు. చదవండి(యూపీలో జర్నలిస్టు పాశవిక హత్య...)
వివరాల్లోకి వెళితే.. కమల్‌పూర్ గ్రామంలో జరిగే వివాహ వేడుకకు హాజరయ్యేందుకు మహిళలు వెళ్తున్నారు. నిందితుడు, అతని స్నేహితులు రోడ్డుపై మద్యం సేవిస్తూ, దారివెంట వెళ్లే మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారు. కిషన్ లాల్ అభ్యంతరం చెప్పగా...గొడవ మొదలైంది. ఈ క్రమంలో నిందితుడు అతడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన సారామైర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీస్ అధికారిని సర్వేశ్‌గా గుర్తించారు. అతడితో సహా మరో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, భారత శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడిన కిషన్ లాల్‌ని మెరుగైన చికిత్స కోసం వారణాసికి తరలించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి