ఎంఎస్సీ చదివి ఇంట్లో చెప్పకుండా ఒకరు.. పాల ప్యాకెట్‌ కోసం వెళ్లి మరొకరు.. | Two womens Missing In Medak | Sakshi
Sakshi News home page

ఎంఎస్సీ చదివి ఇంట్లో చెప్పకుండా ఒకరు.. పాల ప్యాకెట్‌ కోసం వెళ్లి మరొకరు..

Jan 17 2023 11:04 AM | Updated on Jan 17 2023 11:54 AM

Two womens Missing In Medak - Sakshi

హైదరాబాద్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రామనాయుడు కథనం ప్రకారం.. పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామానికి చెందిన అంజనేయులు కూతురు అర్చన(25) ఎంఎస్‌సీ వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. ఈ నెల 13వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఫోన్‌ను సైతం ఇంట్లో వదిలి వెళ్లింది. దీంతో కూతురు అదృశ్యంపై తండ్రి అంజనేయులు సోమవారం ఫిర్యాదు చేయగా ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

పాల ప్యాకెట్‌కు వెళ్లిన యువతి 
పటాన్‌చెరు టౌన్‌: ఇంటి నుంచి పాల ప్యాకెట్‌ కోసం వెళ్లి ఓ యువతి అదృశ్యమైన సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ ప్రసాద్‌రావు కథనం ప్రకారం.. పటాన్‌చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామానికి చెందిన బుచ్చయ్య రెండో కూతురు సౌందర్య(26) పదో తరగతి వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో 15వ తేదీన సాయంత్రం ఇంటి నుంచి పాల ప్యాకెట్‌ కోసం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద ఎంత వెతికినా ఆచుకీ లభించలేదు. ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచి్చంది. దీంతో కూతురు అదృశ్యంపై తండ్రి బుచ్చయ్య సోమవారం ఫిర్యాదు చేయగా, ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement