కోవిడ్‌ వార్‌ రూమ్‌ సిబ్బంది నిర్వాకం

Two Arrested On Hospital Beds Blocking Case In Banashankari - Sakshi

బనశంకరి: బెడ్‌బ్లాకింగ్‌ కేసులో మరో ఇద్దరు పట్టుబడ్డారు. బీబీఎంపీ దక్షిణ వలయ కోవిడ్‌ వార్‌ రూమ్‌ హెల్ప్‌లైన్‌లో పనిచేసే వరుణ్, అతడి స్నేహితుడు యశ్వంతకుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బెడ్‌ అవసరమైన వారి ఫోన్‌ నంబరును వరుణ్‌ సేకరించి స్నేహితుడు యశవంత్‌కుమార్‌ ద్వారా మాట్లాడించేవాడు. ఐసీయూలో ఆక్సిజన్, వెంటిలేటర్‌ సౌలభ్యం కలిగిన బెడ్‌ ఇస్తామని చెప్పి తన బ్యాంక్‌ అకౌంట్‌కు నగదు జమ చేయించుకొని  ప్రభుత్వ కోటాలోని బెడ్‌ కేటాయింపు చేసేవాడు. ఇప్పటి వరకు ఎంతమంది వద్ద డబ్బు తీసుకున్నారనేది విచారిస్తున్నామని సీసీబీ జాయింట్‌ కమిషనర్‌ సందీప్‌పాటిల్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top