ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా డాక్టర్‌ సహా ముగ్గురి దుర్మరణం | Three people were Deceased in Car Crash With Truck At Selam | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా డాక్టర్‌ సహా ముగ్గురి దుర్మరణం

Oct 30 2021 7:48 AM | Updated on Oct 30 2021 11:57 AM

Three people were Deceased in Car Crash With Truck At Selam - Sakshi

మృతులు దేవనాథన్, ఇంద్రాణి, సత్యశీలన్‌

సేలం (చెన్నై) : లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో మహిళా డాక్టర్‌ సహా ముగ్గురు దుర్మణం చెందారు. ఈ ఘటన గురువారం రాత్రి మెచ్చేరిలో చోటుచేసుకుంది. సేలం జిల్లా మెచ్చేరి సమీపంలోని ఉడయనూర్‌కు చెందిన ఎం.దేవనాథన్‌ (53) ప్రైవేటు సంస్థ మేనేజర్‌. ఈయన భార్య ఇంద్రాణి (51) వనవాసి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌గా పని చేస్తున్నారు.

గురువారం రాత్రి కోవై నుంచి కారులో మేట్టూర్‌కు వస్తున్నారు. వీరితో పాటు దేవనాథన్‌తో పని చేస్తున్న ఉద్యోగి ఆర్‌.సత్యశీలన్‌ (24) కూడా ఉన్నారు. రాత్రి 10.30 గంటలకు భవాని–మేట్టూర్‌ సాలై మార్గంలోని కాట్టప్పనల్లూర్‌ మలుపు వద్ద ఎదురుగా వచ్చిన లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. భవాని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారులో చిక్కుకున్న మృతదేహాలను అతి కష్టంపై బయటకు తీసుకొచ్చారు. కేసు నమోదు చేసి విచారిణ చేస్తున్నారు.  


 

Advertisement
 
Advertisement
Advertisement