Theft While Begging In Disguise As Siddhanti - Sakshi
Sakshi News home page

సిద్ధాంతి వేషధారణలో బిక్షాటన! భయపెడుతూ డబ్బు గుంజి..

Dec 15 2021 12:45 PM | Updated on Dec 16 2021 8:59 AM

Thefts While Begging In Disguise As Siddhanti - Sakshi

వెంకటకృష్ణాపురంలో సీసీ కెమెరాకు చిక్కిన నకిలీ సిద్ధాంతి

ద్వారకాతిరుమల: మండలంలోని వెంకటకృష్ణాపురంలో నకిలీ సిద్ధాంతి గుట్టు రట్టయ్యింది. స్థానికుల కథనం ప్రకారం... అన్నవరం సిద్ధాంతిని అంటూ ఓ వ్యక్తి వెంకటకృష్ణాపురంలోని చిలుకూరి సునీత ఇంటికి కారులో వచ్చాడు. ముందుగా అతడి సహాయకుడు గేటు తీసి, సిద్ధాంతి వచ్చారని పిలిచాడు. బయటకు వచ్చిన సునీతను బియ్యాన్ని భిక్ష ఇవ్వాలని కోరాడు. ఆమె బియ్యం తీసుకురాగా.. చిటికెడు మాత్రమే తన పాత్రలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఇంటి వాస్తు బాగుందని, కలబంద, గుమ్మడి కాయలు కట్టాలని సూచించాడు. 

ఇంతలో అతని మాటల్ని సునీత తన భర్త రాధాకృష్ణకు ఫోన్‌ స్పీకర్‌ ద్వారా వినిపించింది. రాధాకృష్ణ అక్కడికి వచ్చి అతన్ని నిలదీశాడు. వెంటనే నకిలీ సిద్ధాంతి పొంతనలేని సమాధానాలు చెబుతూ ఆగకుండా కారులో ఉడాయించాడు. నకిలీ సిద్ధాంతి కారును రాధాకృష్ణ వెనుక నుంచి ఫొటో తీసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టి అందరినీ అప్రమత్తం చేశాడు. ఈనెల 9న తిమ్మాపురంలో ఘంటా చిన్న గాంధి అతని మాటలు నమ్మి రూ 16,500, కామవరపుకోట మండలంలోని ఆడమెల్లిలో మూడు రోజుల క్రితం ఒక వ్యక్తి రూ. 10 వేలు పోగొట్టుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. రాధాకృష్ణ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమేరాల్లో నకిలీ సిద్ధాంతి వ్యవహారం రికార్డ్‌ అయ్యింది. ఫిర్యాదు అందరకపోయినా ద్వారకాతిరుమల పోలీసులు విచారణ చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ఎస్సై టి.వెంకట సురేష్‌ కోరారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement