ప్రియురాలితో గోవా టూర్‌ కోసం ఏం చేశాడో తెలిస్తే షాకే!

Robbery at home to go on Vacation to Goa with Girl friend - Sakshi

సాక్షి, బెంగళూరు: ప్రియురాలితో గోవా విహారయాత్రకు వెళ్లేందుకు ఇంట్లోనే చోరీకి పాల్పడిన యువకుడిని మంగళవారం ఆడుగోడి పోలీసులు అరెస్ట్‌చేశారు. ఆడుగోడి మహాలింగేశ్వరబండె ఏరియాలో సోదరుడు సల్మాన్‌తో కలిసి నిందితుడు మహమ్మద్‌ ఇర్ఫాన్‌ ఉంటున్నాడు. సల్మాన్‌ సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తుంటే ఇర్ఫాన్‌ బలాదూర్‌గా తిరిగేవాడు. ఇటీవల ఓ యువతిని ప్రేమించాడు. ఆమె గోవా టూర్‌కు తీసుకెళ్లాలని కోరింది.

సరేనన్న ఇర్ఫాన్‌ డబ్బుల కోసం ఆలోచించి ఇంట్లోనే చోరీకి ప్లాన్‌ చేశాడు. బీరువాలో ఉన్న 103 గ్రాముల బంగారు నగలు తీసుకుని ఉడాయించాడు. విషయం తెలిసి సల్మాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు గోవాకు వెళ్లి షికార్లు చేస్తున్న ఇర్ఫాన్‌ను అరెస్ట్‌చేసి అతడి వద్ద నుంచి 103 గ్రాముల బంగారు ఆభరణాలు, కొంత డబ్బును స్వాధీనం చేసుకున్నామని ఆగ్నేయవిభాగ డీసీపీ సీకే.బాబా తెలిపారు.     

చదవండి: (నివేదన ప్రేమవివాహం.. ఇంటికి వచ్చి చూసే సరికి..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top