Ranga Reddy Beautician Found Suspicious Death In Kokapet, Crime News - Sakshi
Sakshi News home page

Hyderabad Crime: కోకాపేటలో బ్యూటీషియన్‌ అనుమానాస్పద మృతి.. ఆ టైమ్‌లో బాయ్‌ఫ్రెండ్‌

Mar 9 2022 2:43 PM | Updated on Mar 9 2022 6:23 PM

Ranga Reddy: Beautician Suspicious Death At Kokapet - Sakshi

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ​కోకాపేటలో బ్యూటీషియన్‌ పనిచేస్తున్న లాల్వెన్ పులి అనే యువతి.. బాయ్ ఫ్రెండ్ ఇంట్లో..

సాక్షి, రంగారెడ్డి: స్పాలో పనిచేస్తున్న అస్సాంకు చెందిన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మిజోరం రాష్ట్రానికి చెందిన రోసీ (23) తన స్నేహితురాలు లాల్వెన్‌తో కలిసి నెల రోజుల క్రితం కోకాపేటలోని ఐఎస్‌ఏ స్పాలో థెరపిస్టుగా చేరారు. స్పా యజమాని ఆనందరావు కోకాపేటలో వారికి ఓ గది ఇప్పించారు. అయితే రోసీ ఆదివారం గదికి రాలేదు. దీంతో స్నేహితురాలు సోమవారం స్పాకు వెళ్లి రాత్రికి వచ్చింది. రోసీ మంగళవారం ఉదయం పార్సిల్‌లో ఏదో తెప్పించుకొని తిన్నది.

ఆ సమయంలో గదిలో ఆమెతో పాటు నాగాలాండ్‌కు చెందిన ప్రియుడు లన్సో ఉన్నాడు. పార్సిల్‌లో వచ్చింది తిని బాత్రూంకు వెళ్లిన రోసీ ఎంత సేపటికీ బయటకు రాకపోవటంతో లన్సో డోర్‌ తొలగించి చూడగా అపస్మారక స్థితిలో పడి ఉంది. అంతేకాకుండా బాత్రూంలో ఇంజెక్షన్‌ సిరంజి, మాత్రలు కనిపించాయి. దీంతో లన్సో వెంటనే 108 ద్వారా సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ధృ వీకరించారు. మృతురాలి బంధువు బినిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  
చదవండి: అమ్మమ్మ పాలకూర కావలంటూ.. పుస్తెలతాడుతో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement