విషాదం: భార్య మృతిని తట్టుకోలేక.. | Police Inspector Deceased In Tamil Nadu | Sakshi
Sakshi News home page

విషాదం: భార్య మృతిని తట్టుకోలేక..

Jun 4 2021 7:23 AM | Updated on Jun 4 2021 7:23 AM

Police Inspector Deceased In Tamil Nadu - Sakshi

భార్య మృతిని తట్టుకోలేక పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరుపత్తూరు సమీపంలోని పాముత్తపట్టి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పురుషోత్తమన్‌(58), సుజాత(48) దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

వేలూరు: భార్య మృతిని తట్టుకోలేక పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరుపత్తూరు సమీపంలోని పాముత్తపట్టి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పురుషోత్తమన్‌(58), సుజాత(48) దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పురుషోత్తమన్‌ క్రిష్ణగిరి జిల్లా బర్గూర్‌లోని పోలీస్‌ స్టేషన్‌లో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. బర్గూరులోని పోలీస్‌ క్యార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు.

ఇంజినీరింగ్‌ చదువుతున్న చిన్న కుమారుడు దీపక్‌ రెండు రోజుల క్రితం తల్లి సుజాతతో ఘర్షణ పడ్డాడు. దీంతో మనోవేదన చెందిన ఆమె మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నారు. భార్యకు సొంత గ్రామమైన పాముత్తపట్టిలో దహన క్రియలు చేయాలని పురుషోత్తమన్‌ నిర్ణయించుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఇంటి మిద్దెపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపత్తూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: లైంగిక వేధింపులు: బయటపడ్డ కీచక బాబా లీలలు   
తన భార్యను కరిచిందని కుక్కపై ప్రతీకారం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement