నాగుపాముతోనే నాగిని డ్యాన్స్‌.. కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు

Nagin Dance At Odisha Wedding Viral With Real Snake Sent Men Jail - Sakshi

బారాత్‌ అనే పేరు వింటే చాలూ.. పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటారు కొందరు. చుక్కపడిందంటే చాలూ.. సోయి మరిచి చిందులేస్తుంటారు మరికొందరు. అందునా నాగిని డ్యాన్స్‌ను ఉన్న క్రేజే వేరు. కానీ, ఇక్కడ నాగిని డ్యాన్స్‌ చేసి కటకటాల పాలయ్యారు. అయ్యో.. అంతమాత్రానికేనా అనుకోకండి. 

నాగిని డ్యాన్స్‌ కోసం నిజంగానే పామును పట్టుకొచ్చారు వాళ్లు. ఒడిషాలోని మయూర్‌భంజ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహ వేడుక కోసం నాగుపామును తీసుకొచ్చి.. నాగిని డ్యాన్స్‌ పేరిట ఆడించడం మొదలుపెట్టారు. పాములు పట్టే వ్యక్తి దానిని ఆడిస్తుంటే.. వందల మంది చుట్టూ చేరి ఆ రియల్‌ నాగిని డ్యాన్స్‌ను చూస్తూ ఉండిపోయారు.

బుట్టలో పాము.. చెవ్వులు పగిలిపోయే మ్యూజిక్‌, నృత్యాల కోలాహలంతో బారాత్‌లో ఆ నాగిని డ్యాన్స్‌ వీడియో విపరీతంగా వైరల్‌ అయ్యింది. మరి అధికారులు ఊరుకుంటారా? వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ఐదుగురు అరెస్ట్‌ చేసి, ఆ పామును ఫారెస్ట్‌ అధికారులకు అప్పగించారు.    

జనాల మధ్య అలా పామును ఆడించడం దుర్మార్గం. బుట్టలోంచి అది పొరపాటున కింద పడితే జనాల ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి, ఇలాంటి ఫీట్లు చేయొద్దంటూ  హెచ్చరిస్తున్నారు కొందరు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top