వైద్య రహస్యం చెప్పలేదని.. ఏడాదిన్నరపాటు గదిలో బంధించి..

Mysore Traditional Physician Assassination Case Kerala Police Solved Mystery - Sakshi

మైసూరు: మూడేళ్ల కిందట మైసూరులో అదృశ్యమైన నాటు వైద్యుడు షాబాద్‌ షరీఫ్‌ (48) హత్యకు గురైనట్లు తెలిసింది. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సరస్వతీ పురం పోలీసులు కేసు వివరాలను వెల్లడించారు. షరీఫ్‌ పూర్వీకులు ఎంతోకాలం నుంచి పైల్స్, ఫిస్టులాకు వైద్యం చేసేవారు. ఇందులో రహస్యం తెలుసుకోవాలని కేరళ మలప్పురం జిల్లా నీలాంబూర్‌కు చెందిన షైబీన్‌ అష్రఫ్, మరికొందరు కలిసి తమవారికి పైల్స్‌ ఆపరేషన్‌ చేయాలని చెప్పి 2019 ఆగస్టులో షరీఫ్‌ను కారులో కేరళకు తీసుకెళ్లారు.

అతన్ని సుమారు యేడాదిన్నరపాటు ఒక గదిలో బంధించి పైల్స్, ఫిస్టులా చికిత్సా రహస్యాలను చెప్పాలని హింసించారు. కానీ ఫరీఫ్‌ నోరు విప్పలేదు. దీంతో దుండగులు అతన్ని ముక్కలుగా నరికిచంపి ప్లాస్టిక్‌ కవరులో కట్టి నదిలో పడేశారు.  ఈ కేసు మిస్టరీ అనుకోకుండా వీడింది. నీలాంబూర్‌లో నిందితుడు అష్రఫ్‌ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో నాటు వైద్యుని హత్య కేసు వివరాలు బయటపడ్డాయి. దీంతో అక్కడి పోలీసులు మైసూరుకు వచ్చి మరింత దర్యాప్తు చేసి నిర్ధారించారు. నలుగురిని అరెస్టు చేశారు.  

చదవండినువ్వు లేకపోతే చచ్చిపోతానని నమ్మించి.. పలుమార్లు లైంగిక దాడి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top