బిడ్డను కొట్టి చంపిన కేసులో.. 22 ఏళ్ల గర్భిణి అరెస్టు..!

Mother Beating Daughter Due To Playing With Water And Child Succumbed - Sakshi

ఓ రెండేళ్ల వయసు పిల్లలు ఏం చేస్తారు? కుదురితే అల్లరి లేదా తమ తోటి పిల్లలతో ఆడుకోవడం. అయితే కొన్నిసార్లు తెలియక చేసే తప్పులు పెద్దలకు కోపం తెప్పిస్తాయి. కానీ పిల్లలకు ఏది మంచి! ఏది చెడు! అని చెప్పే బాధ్యత తల్లిదండ్రులది . అంతేకానీ ఇష్టారీతిగా వారిపై దాడి చేస్తే.. ఆ పసిమనసులు తట్టుకుంటాయా..! పాపం, పుణ్యం తెలియని పసి హృదయాలు తిరగబడతాయా..?

ముంబై: మహారాష్ట్రలో ఓ మహిళ తన రెండేళ్ల కూతురుని కొట్టడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై నేహా సోని అనే 22 ఏళ్ల గర్భిణిని పోలీసులు అరెస్టు చేశారు.  పోలీసులు వివరాల ప్రకారం...  శనివారం రాత్రి 8 గంటల సమయంలో  విరార్ (తూర్పు) లోని ఫూల్‌పాడా నివాసి అయిన నేహా సోని అనే మహిళ  తన కుమార్తె నాన్సీని ఇంటి లోపల నీటితో ఆడుకునే సమయంలో కొట్టింది. దీంతో ఆ చిన్నారి స్పృహ కోల్పోయింది.  ఆ పాపను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది.  కానీ అప్పటికే నాన్సీ మరణించిందని వైద్యులు తెలిపారు. అయితే తాను బిడ్డను కొట్టినట్లు సోనీ ఆసుపత్రికి వారికి చెప్పలేదు.

కానీ పొరుగున ఉండే వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ముంబైలోని జేజే ఆసుపత్రికి పంపించారు. పోస్ట్ మార్టంలో తల, కడుపుపై ​​పలు అంతర్గత గాయాలు అయినట్లు తేలింది. ఆ నివేదిక ఆధారంగా.. సోనీపై ఐపీసీ సెక్షన్ 302 కింద హత్యకు సంబంధించి ఎఫ్ఐఆర్‌ నమోదు చేసినట్లు విరార్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్‌ సురేష్ వర్హాడే తెలిపారు. కాగా రిక్షా డ్రైవర్ అయిన సోనీ భర్త ఆ సమయంలో పనికి వెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top