సినీ ఫక్కీలో ఘటన, రూ.20 లక్షలు చోరీ!

Miscreants Looted Rs 20 Lakhs At Madhurawada In Visakhapatnam - Sakshi

విశాఖలో 20 లక్షల నగదు దోపిడి

సాక్షి, విశాఖపట్నం: పోలీసుల ముసుగులో వచ్చిన కొందరు దుండగులు ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నుంచి రూ. రూ.20 లక్షలు కొట్టేశారు. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన మధురవాడలో మంగళవారం ఈ చోటుచేసుకుంది. వివరాలు.. మధురవాడకు చెందిన రియల్టర్ కోటేశ్వరరావు ఓ స్థలం కొనుగోలు విషయంపై మరో రియల్ ఎస్టేట్ బ్రోకర్ వెంకటేశ్వర్లుతో కలిసి చర్చించాడు. ఇద్దరూ కలిసి నగర శివారులోని ఓ స్థలాన్ని మంగళవారం పరిశీలించారు.
(చదవండి: కస్టడీ నుంచి నిందితుడి పరారీ)

అదే సమయంలో పోలీస్ సైరన్ మోగిస్తూ వాహనంలో వచ్చిన దుండగులు నాగేశ్వరరావు వద్ద ఉన్న 20 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు. ఇటీవల ఓ భూమి అమ్మగా వచ్చిన రూ.50 లక్షల నగదులో 20 లక్షలతో మరో భూమిని కొనుగోలు చేయడానికి తాను వచ్చానని నాగేశ్వరావు చెబుతున్నాడు. బాధితుని ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, ఈ దోపిడీ విషయం పై కొన్ని అనుమానాలు ఉండటంతో నాగేశ్వరరావుతో పాటు బ్రోకర్ వెంకటేశ్వరరావును కూడా పోలీసులు విచారిస్తున్నారు.
(విశాఖ సీపీగా మనీష్‌కుమార్‌ సిన్హా బాధ్యతలు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top