
ఆత్మహత్య చేసుకున్న బాలాజీ
బంజారాహిల్స్: తనకంటే మూడేళ్లు పెద్దదైన యువతిని ప్రేమించి సహజీవనం చేస్తూ మూడు రోజులు గడవకముందే విభేదాలు పొడసూపి ఇద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా దురదృష్టవశాత్తు బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... యూసుఫ్‌గూడ సమీపలలోని యాదగిరి నగర్‌లో నివసించే బి.బాలాజీ(17) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
అదే ప్రాంతంలో అద్దెకుంటూ సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న బి.నీలిమ అలియాస్ అమ్ము(20)తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ కొద్ది రోజులుగా జవహర్‌నగర్‌లో గది అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు. వారం క్రితం గదిలోనే పెళ్లి చేసుకున్నారు. ఇంకో వారం రోజులు గడిస్తే 17 ఏళ్ల వయసు వచ్చే క్రమంలో బాలాజీకి ఆ యువతితో గొడవలు మొదలయ్యాయి.
శనివారం తెల్లవారుజామున ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. ఈ మేరకు బాలాజీ ఫ్యాన్‌కు ఉరేసుకొగా నీలిమ చున్నీతో మెడకు బిగించుకొని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. బాలాజీ మృతి చెందిగా ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. మృతుడి తండ్రి ఏఆర్ ఏఎస్‌ఐగా పని చేస్తున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: లాక్‌డౌన్ వేళ.. ఇంటింటా హింస.. ఇంతింతా కాదు!