చిచ్చు రాజేసిన ఎండుగడ్డి.. 150 వాహనాలు అగ్నికి ఆహుతి | Massive Fire Accident In Bangalore Srirampura | Sakshi
Sakshi News home page

చిచ్చు రాజేసిన ఎండుగడ్డి.. 150 వాహనాలు అగ్నికి ఆహుతి

Jan 29 2025 6:29 PM | Updated on Jan 29 2025 7:08 PM

Massive Fire Accident In Bangalore Srirampura

బెంగళూరు : శ్రీరామ్‌ పురాలో (srirampura) భాగీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 150 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. బెంగళూరు (bangalore) పోలీసు వివరాల మేరకు.. బెంగళూరు సిటీ పోలీసులు వివిధ కేసుల్లో  సీజ్‌ చేసిన వాహనాల్ని జక్కరాయనకెరె ప్రాంతంలో రెండెకరాల స్థలంలో పార్క్‌ చేస్తుంటారు.

ఈ నేపథ్యంలో బుధవారం వాహనాలు పార్క్‌ చేసిన ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో పార్క్‌ చేసిన వాహనాల్లో 150 వాహనాలు దహనమైనట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వివరించారు.

అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాలుగు ఫైరింజన్లను ఎగిసిపడుతున్న మంటల్ని అదుపు చేసేందుకు రెండుగంటల పాటు నిర్విరామంగా ప్రయత్నించారు. ఇక అగ్నికి ఆహుతైన వాహనాల్లో 130 ద్విచక్రవాహనాలు,10 ఆటోలు, పది కార్లు ఉన్నట్లు సమాచారం.  

అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న శ్రీరామ్‌ పురా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో ఎండిన గడ్డి కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు గుర్తించారు. కేసు విచారణ కొనసాగుతోంది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement