
ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఇలాంటి ప్రయత్నాలు ఎవరూ చేయకూడదని వేడుకున్నాడు.
సాక్షి, మహబూబాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం ఓటమిని జీర్ణించుకోలేక మహబూబాబాద్ జిల్లా మల్యాల సాదుతండాకు చెందిన గుగులోతు రాజు ఆదివారం మధ్యాహ్నం నలంద డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ డోలి సత్యనారాయణ, నాయకులు అతడిని కాపాడారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఇలాంటి ప్రయత్నాలు ఎవరూ చేయకూడదని వేడుకున్నాడు. ఆయన వెంట జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సుధాకర్, యువజన నాయకుడు ఇరుగు మనోజ్ తదితరులు పాల్గొన్నారు.