దారుణం: తల చెరువులో.. మొండెం చెట్ల పొదల్లో | Man Deceased In Vikarabad And Found In Pond | Sakshi
Sakshi News home page

దారుణం: తల చెరువులో.. మొండెం చెట్ల పొదల్లో

Mar 2 2021 5:28 PM | Updated on Mar 2 2021 6:07 PM

Man Deceased In Vikarabad And Found In Pond - Sakshi

సాక్షి, వికారాబాద్: బొంరస్‎పేట మండలంలోని మెట్లకుంట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుర్వ చంద్రయ్య (52)అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు అతికిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మెట్లకుంట గ్రామానికి చెందిన కుర్వ చంద్రయ్యను గ్రామ శివారులోని ఎల్లమ్మ చెరువు దగ్గర గుర్తు తెలియని దుండగులు తల, మొండెం వేరు చేసి అతి దారుణంగా హతమర్చారు. తల చెరువులో వేయగా.. మొండెం చెట్ల పొదల్లో పడేశారు.

ఆదివారం రోజున పొలంకు వెళ్లిన చంద్రయ్య తిరిగి ఇంటికి రాకపోవడంతో సోమవారం కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‎కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు చెరువు దగ్గర పోలీసులు గాలింపు చేపట్టడంతో చంద్రయ్య శవం లభ్యమైంది. హత్య చేసిన ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

చదవండి:  ‘ప్రియుడి’ హత్య.. ఆపై ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు
చదవండి:  సత్తా చాటుతున్న వరంగల్‌ సైబర్‌ క్రైం పోలీసులు

Advertisement
 
Advertisement
Advertisement