కలెక్టరేట్ వద్ద యువకుడి ఆత్మహత్య | Man Deceased In Front Of Collectorate Office At Anantapur | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్ వద్ద యువకుడి ఆత్మహత్య

Oct 12 2020 11:48 AM | Updated on Oct 12 2020 1:37 PM

Man Deceased In Front Of Collectorate Office At Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన ఓ యువకుడు చికిత్సి పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. నార్పల మండలం గూగూడుకు చెందిన రాజశేఖర్‌రెడ్డి సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయం వద్దకు వచ్చి పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కాగా పొదుపు సంఘంలో తన తల్లికి రావాల్సిన డబ్బు అందలేదన్న మనస్తాపంతో రాజశేఖర్‌ ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement