పుట్టింటి నుంచి భార్య రావడంలేదని..

సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీ భవాని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పుట్టింటి నుంచి భార్య రావడం లేదని భర్త మొహమ్మద్ శబజ్ కొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నంకి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శబజ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. సంతోష్ నగర్‌కి చెందిన మొహమ్మద్ శబజ్ వృత్తి ఆటో డ్రైవర్. భవాని నగర్‌కి చెందిన బేగంతో సంవత్సరం క్రితం వివాహం జరిగింది. శబజ్ ఇది రెండవ పెళ్లి. నిత్యం మద్యం, వైట్నర్ సేవించి భార్యని కొట్టడం చిత్రహింసలకు గురిచేసేవాడు. భర్త వేధింపులు కట్టుకోలేక మహిళ పోలీస్ స్టేషన్‌లో భార్య ఫిర్యాదు చేసింది. అనంతరం పుట్టింటిలోనే ఉంటోంది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం తన ఇంటికి రావాలని శబజ్ భార్యతో గొడవపడ్డాడు. అయినప్పటీకి ఆమె రాకపోవడంతో బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో అతనికి వైద్య చికిత్స అందిస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి