అక్రమ సంబంధం.. రాక్షసునిగా మారిన భర్త | Man Assassination His Wife In Mysore | Sakshi
Sakshi News home page

అక్రమ సంబంధం.. రాక్షసునిగా మారిన భర్త

Jan 19 2021 5:18 AM | Updated on Jan 19 2021 5:18 AM

Man Assassination His Wife In Mysore - Sakshi

హతురాలు సౌమ్య, నిందితుడు రవి (ఫైల్‌)  

సాక్షి, మైసూరు : భార్యపై అక్రమ సంబంధం అనుమానంతో ఓ భర్త రాక్షసునిగా మారాడు. ఆమెను గొంతు పిసికి బలిగొన్న దుర్ఘటన మైసూరు జిల్లాలోని హుణసూరు కల్కుణికె హోసింగ్‌ బోర్డు కాలనీలో చోటుచేసుకుంది. హతురాలు సౌమ్య(30) కాగా, నిందితుడు రవి. వీరికి 11 ఏళ్ల కిందట పెళ్లి కాగా, గౌరవ్‌ (9), అకుల్‌ (7) అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. భార్య పైన ఇటీవల అనుమానం పెంచుకున్న రవి అనేకసార్లు ఆమెతో గొడవ పడ్డాడు. ఒకటిరెండుసార్లు పోలీసుల వద్దకు వెళ్లగా రాజీ చేసి పంపారు.

కానీ రవిలో అనుమాన భూతం పోలేదు. ఆదివారం నిద్రపోయిన సమయంలో రవి భార్య గొంతు పైన కాలుతో తొక్కి హత్య చేశాడు. ఆమె ఇంకా చనిపోలేదేమో అనే అనుమానంతో చున్నీని గొంతుకు బిగించి ఉరివేశాడు. తరువాత ఇంటి నుంచి పరారైనాడు. సోమవారం ఉదయం ఎంతకు తలుపులు తీకపోవడంతో ఇరుగుపొరుగు వచ్చి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుణసురు పొలీసులు పరిశీలించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. రంగనాథ లేఔట్‌లో దాక్కున్న కిరాతక భర్తను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘోరంతో అభంశుభం తెలియని పిల్లలు అనాథలయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement