Kukatpally Molestation Case: Police Records the Victim Statement - Sakshi
Sakshi News home page

3 నెలల క్రితం జోసెఫ్‌తో పరిచయం: బాధితురాలు

Oct 16 2020 3:39 PM | Updated on Oct 16 2020 8:38 PM

Kukatpally Molestation Case Police Records Victim Statement - Sakshi

జరిగిన ఘటనను ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఇంటికి వచ్చిన తర్వాత నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది

సాక్షి, హైదరాబాద్‌: ‘‘మూడు నెలల క్రితం జోసెఫ్‌ నాకు పరిచయమయ్యాడు. బర్త్‌ డే ఉందని నన్ను తీసుకెళ్లారు. కేక్‌ తిన్న తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. జరిగిన ఘటనను ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఇంటికి వచ్చిన తర్వాత నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది’’ అని కూకట్‌పల్లి సామూహిక అత్యాచార బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. నమ్మించి, తనను మోసం చేసిన నిందితులకు కఠిన శిక్ష పడాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేసింది. (చదవండి: ఓయో లాడ్జ్‌ నిర్వాకం వల్లే ఇదంతా!)

కాగా జోసెఫ్‌, రాము, న‌వీన్‌ అనే ముగ్గురు యువతులు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. ఓయో హోటల్‌ రూంలో అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు, విషయం బయటకు చెప్పొద్దంటూ ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే బాధితురాలి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేర్పించగా ఈ ఘాతుకం గురించిన నిజాలు వెలుగులోకి వచ్చాయి. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు ఈ ముగ్గురిపై కేసు నమోదు చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement