ఘోర ప్రమాదం.. ఇస్రో క్యాంటీన్‌లో పనిచేసే ఉద్యోగులు దుర్మరణం

Kerala Alappuzha Road Accident ISRO Canteen Staff Dead - Sakshi

తిరువనంతపురం: కేరళ అలప్పూజ జిల్లా అంబలపూజలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రైస్ లోడుతో వెళ్తున్న లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

సోమవారం ఉదయం 1:30 గంటల సమయంలో జాతీయ రాహదారిపై ఈ దుర్ఘటన జరిగింది.  మృతులను ప్రసాద్, శిజు, అమల్, సచిన్, సుమోద్‌గా గుర్తించారు.  వీరంతా తిరువనంతపురంలోని ఇస్రో క్యాంటీన్‌లో పనిచేస్తున్నారు.

మృతుల్లో నలుగురు తిరువనంతపురానికే చెందిన వారు కాగా.. ఒక్కరు కొల్లంకు చెందివారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. లారీ డ్రైవర్‌తో పాటు క్లీనర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: కారును ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. ఆరుగురు దుర్మరణం..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top