Karnataka: 5 killed, 14 injured in a road accident in Yadgir - Sakshi
Sakshi News home page

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీవాసులు ఐదుగురు మృతి

Jun 6 2023 10:57 AM | Updated on Jun 6 2023 11:30 AM

Karnataka: Road Accident 5 People Dead, 13 Injured In Yadgir - Sakshi

బెంగళూరు: కర్ణాటక రాష్టంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యాదగిర్‌ జిల్లాలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదు మంది అక్కడిక్కడే మృతిచెందగా, 14 మందికి తీవ్ర గాయాలపాలయ్యారు. వీరంతా బండిఆత్మకూరు, వెలుగోడు నుండి  గుల్బర్గాదర్గా దర్శనానికి  వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారు నంద్యాల జిల్లా, వెలుగోడు బండి ఆత్మకూరుకు చెందినవారుగా గుర్తించారు.

ఈ ఘటనపై శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి  వ్యక్తం చేశారు.  ఘటన స్థలానికి వెలుగోడుకు చెందిన నాయకులను, అడ్వకెట్ ను పంపారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామి ఇచ్చారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సొంత ఖర్చులతో ప్రమాద బాధితులు, మృతదేహల తరలింపుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

చదవండి: అర్ధరాత్రి క్లాసులు.. అసభ్యకర చేష్టలు.. వ్యవహారం బయటపడిందిలా?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement