భర్త బెయిల్‌ కోసం భార్య ఎంత పని చేసిందంటే?

Karnataka: Police Arrested Woman For Selling Drugs Over Husband Bail - Sakshi

బనశంకరి(బెంగళూరు): భర్తను బెయిల్‌పై బయటకు తీసుకొచ్చే క్రమంలో న్యాయవాదికి చెల్లించాల్సిన ఫీజు కోసం డ్రగ్స్‌ విక్రయాలకు పాల్పడిన టాంజానియాకు చెందిన ఫాతిమాఓమెరిని బాణసవాడి పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. రూ.1.5 లక్షల విలువైన 13 గ్రాముల ఎండీఎంఏ క్రిస్టల్‌ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ భీమాశంకరగుళేద్‌ శుక్రవారం తెలిపారు. 

మరో ఘటనలో..
బంగారు, నగదు చోరీ
మైసూరు : నంజనగూడులోని దేవీరమ్మనహళ్లి రోడ్డులో నివాసం ఉంటున్న రంగరాజు, భువనేశ్వరి దంపతుల ఇంటిలో చోరీ జరిగింది.  దంపతులు బయటకు వెళ్లిన సమయంలో దొంగలు చొరబడి 250 గ్రాముల బంగారం, 1.50 కిలోల వెండి, రూ.80 వేల నగదు దోచుకెళ్లారు. 

సెల్‌ఫోన్ల దొంగ అరెస్ట్‌
సెల్‌ఫోన్లు, బైక్‌లు చోరీ చేస్తున్న మైసూరులోని కే.ఎన్‌.పురకు చెందిన శోయబ్‌(21) అనే దొంగను ఉదయగిరి పోలీసులు అరెస్ట్‌ చేశారు. 14 సెల్‌ఫోన్లు, మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top