బాబు అక్రమాస్తుల కేసులో తీర్పు వాయిదా | Judgment Postponed In Chandrababu Illegal Assets Case | Sakshi
Sakshi News home page

బాబు అక్రమాస్తుల కేసులో తీర్పు వాయిదా

Oct 22 2020 4:56 AM | Updated on Oct 22 2020 4:56 AM

Judgment Postponed In Chandrababu Illegal Assets Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ సీఎం చంద్రబాబు అక్రమాస్తులపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని ఏపీ తెలుగు అకాడమీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు నవంబర్‌ 24కు వాయిదాపడింది. సీఎంగా ఉన్న సమయంలో భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారని, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన నేపథ్యంలో ఏసీబీ విచారణకు ఆదేశించాలని లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిలిపి వేయాలంటూ బాబు హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందారు.  

Advertisement
 
Advertisement
Advertisement