ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ఇంటికి వచ్చి దొంగతనం 

Instagram Friendship Gang Robbery In Nagole At Hyderabad - Sakshi

సాక్షి, నాగోలు: ఇన్‌స్టాగ్రామ్‌లో అయిన పరిచయంతో ఆకలవుతుందని ఇంటికి వచ్చి బంధించి సొత్తును దొంగిలించిన అంతర్రాష్ట్ర నేరస్తులను ఎల్‌బీనగర్‌ సీసీఎస్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి  నుంచి రూ.26 లక్షల విలువ చేసే సామగ్రిని స్వాదీనం చేసుకున్నారు. సోమవారం ఎల్‌బీనగర్‌లో  రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు. కర్ణాటకకు చెందిన  నిఖిల్, వినయ్‌ చౌదరి, ఉదయ్‌ కుమార్,  బ్రహ్మ తేజలు చిన్నానాటి స్నేహితులు. నలుగురూ నేరాల బాట పట్టారు. వనస్థలిపురంలో స్వచ్చంద హెల్ప్‌ కిడ్స్‌ హ్యాపీ కిడ్స్‌ అనే సంస్థ నడిపే సతీష్‌తో  ఇన్‌స్ట్రాగామ్‌ లో పరిచయం పెంచుకున్న నిఖిల్‌ అతని ఆర్థిక లావాదేవీల గురించి తెలుసుకున్నాడు. చదవండి: మొన్న తమ్ముడు.. నేడు అన్న

సతీష్‌ దగ్గర డబ్బు కొట్టేయాలని ప్లాన్‌ చేసుకున్నారు. ఈ క్రమంలో నిందితులు బొమ్మ పిస్టల్‌ తీసుకొని వచ్చారు.  ఈ నెల 15వ తేదీన  వనస్థలిపురంలో నివాసముండే సతీష్‌ ఇంటికి నలుగురూ  వచ్చారు. హఠాత్తుగా సతీష్‌పై దాడి చేసి నోరు మూసి తాడుతో చేతులు కట్టి బొమ్మ పిస్టల్‌తో బెదిరించి. నగదు. రూ.1.18 లక్షల నగదు, విదేశీ, కరెన్సీ, రెండు ల్యాప్‌టాప్‌లు, మూడు మొబైల్‌ ఫోన్లు, సిల్వర్‌ నెక్లెస్‌ దోపిడీ చేశారు. తరువాత బళ్లారికి పారిపోయారు. మళ్లీ నేరం చేసేందుకు సోమవారం  శంషాబాద్‌కు వచ్చారు. నిందితులపై నిఘా ఉంచిన ఎల్‌బీనగర్‌ సీసీఎస్‌ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.26 విలువ చేసే వస్తువులను స్వాదీనంచేసుకున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top