వివాహిత ప్రేమ వ్యవహారం.. ఆమె ప్రియుడి ప్రాణం మీదికి..

Husband Stabs Wifes Boyfriend In Kamareddy - Sakshi

సాక్షి, పిట్లం(కామారెడ్డి): వివాహిత ప్రేమ వ్యవహారం ఆమె ప్రియుడి ప్రాణం మీదికి తెచ్చింది. భర్త దాడి చేయగా ప్రియుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలైయ్యాడు. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. పిట్లం మండలంలోని నాగంపల్లితండాకు చెందిన చందర్‌కు, కాస్లాబాద్‌తండాకు చెందిన లక్ష్మితో పదిహేనేళ్ల క్రితం వివాహం జరిగింది. చందర్, భార్య లక్ష్మి, తన నలుగురు పిల్లలతో కలిసి నాగంపల్లి తండాలో కూలిపని చేస్తూ నివసిస్తుండేవాడు. గత కొన్ని రోజులుగా భార్య లక్ష్మి, తలాబ్‌తండాకు చెందిన రాందాస్‌ అనే యువకుడు ప్రే మించుకుంటున్నారు.

చదవండి: (ఆ ప్రేమికుల్ని బలవంతంగా బంధించి.. పూలు చల్లి, పెళ్లి చేసి.. యువతి శరీరంపై..)

ఈక్రమంలో శుక్రవారం రాందాస్‌ నాగంపల్లితండాలోని లక్ష్మిని కలవడానికి వెళ్లగా భర్త చందర్, కుటుంబసభ్యులు అతడిని బెదిరించి పంపించివేశారు. వెంటనే లక్ష్మి, తన పిల్లలతో కలిసి పిట్లం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భర్తతో ఉండనని, రాందాస్‌తోనే ఉంటానని తెలిపింది. రాందాస్, లక్ష్మి స్టేషన్‌లోనే ఉండగా.. సాయంత్రం రాందాస్‌ కానిస్టేబుల్‌ను వెంటతీసుకొని ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ లక్ష్మి భర్త చందర్‌ కత్తితో రాందాస్‌పై దాడి చేసి తల, ఛాతి, కడుపుపై మూడు కత్తిపోట్లు పోడిచాడు. వెంటనే కానిస్టేబుల్, స్థానికుల సహాయంతో చందర్‌ని పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధితుడు రాందాస్‌ను చికిత్స నిమిత్తం పిట్లం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు.  

చదవండి: (విషాదం: కలిసి చదివారు.. కలిసున్నారు.. చివరికి కలిసే..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top