కొడుకు విదేశాలకు వెళ్లాలి.. తెలివిగా 7 కిలోల గోల్డ్‌ కాయిన్స్‌ స్వాహా

Gujarat: Jewellery Store Manager Steals 7 kg Gold Worth Rs 4 Cr - Sakshi

వ‌డోద‌ర: అప్పులు తీర్చేందుకు అడ్డదారులు ఎంచుకున్నాడు ఓ ఉద్యోగి. అందుకు సులభంగా ఉంటుందని తాను పని చేస్తున్న చోటే చేతి వాటం ప్రదర్శించాడు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 కిలోల బంగారాన్ని నగల దుకాణం నంచి మాయం చేసాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విరాల్‌ సోని వడోదరలో ఓ ప్రముఖ నగల దుకాణంలో కొనేళ్లుగా స్టోర్‌ మేనేజర్‌గా పని చేస్తున్నాడు.

కళ్లేదుటే కోట్ల బంగారం కనపడేసరికి అడ్డదారిలో సులువుగా డబ్బు సంపాదించే ఆలోచన మనోడికి వచ్చింది. ఇక ఆలస్యం చేయక తెలివిగా తస్కరించడం మొదలెట్టాడు. ఆ విధంగా సోనీ 2016 నుంచి 2021 మ‌ధ్య రూ. 4 కోట్ల విలువైన 7.8 కిలోల విలువైన 24 కేర‌ట్ల బంగారు నాణేల‌ను చోరీ చేశాడు. కాగా దొంగలించిన ఈ బంగారం అమ్మ‌డంలో అదే స్టోర్‌లో ప‌నిచేస్తున్న త‌ర‌జ్ దివాన్ స‌హ‌క‌రించాడు. షోరూం క్యాషియ‌ర్ల‌కు న‌కిలీ వోచ‌ర్ల‌ను స‌మ‌ర్పించి గోల్డ్ కాయిన్స్‌ను సోని చోరీ చేసినట్లు స్టోర్ య‌జమాని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా ఎప్ప‌టిక‌ప్పుడు ముగ్గురు క‌స్ట‌మ‌ర్ల పేర్ల‌తో న‌కిలీ వోచ‌ర్ల‌ను ఇస్తుండ‌టంతో అనుమానించిన క్యాషియ‌ర్ య‌జ‌మానికి ఫిర్యాదు చేయ‌డంతో ఈ వ్య‌వ‌హారం మొత్తం బ‌య‌ట‌ప‌డింది. కాగా అప్పులు తీర్చేందుకు, త‌న కుమారుడి విదేశీ విద్య కోసం ఈ నేరానికి పాల్ప‌డిన‌ట్టు నిందితుడు ద‌ర్యాప్తులో వెల్ల‌డించాడ‌ని పోలీసులు తెలిపారు.  
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top