Fake Charity Group Using Sonu Sood’s Name To Scam People, Arrested Cyberabad Police - Sakshi
Sakshi News home page

ప్రముఖ నటుడు సోనూసూద్‌ పేరుతో భారీ మోసం..

Apr 3 2021 4:55 PM | Updated on Apr 3 2021 8:47 PM

Fraud In The Name Of Famous Actor Sonu Sood - Sakshi

సోనూసూద్‌ కార్పొరేట్‌ కార్యాలయం పేరుతో పెద్ద మొత్తంలో చీటింగ్‌ జరిగింది. సోనూసూద్‌ కార్పొరేట్‌ సంస్థ పేరుతో ఆశిష్‌కుమార్‌ అనే వ్యక్తి ట్విట్టర్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయగా,ఆ అకౌంట్‌కు బాధితులు పెద్దఎత్తున నిధులు పంపించారు.

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ నటుడు సోనూసూద్‌ పేరుతో భారీ మోసానికి పాల్పడిన యువకుడిని సైబర్‌క్రైమ్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. సోనూసూద్‌ కార్పొరేట్‌ కార్యాలయం పేరుతో పెద్ద మొత్తంలో చీటింగ్‌ జరిగింది. సోనూసూద్‌ కార్పొరేట్‌ సంస్థ పేరుతో ఆశిష్‌కుమార్‌ అనే యువకుడు ట్విట్టర్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయగా, ఆ అకౌంట్‌కు బాధితులు పెద్దఎత్తున నిధులు పంపించారు. సోనూసూద్‌ పేరు చెప్పి ఆశిష్‌ డబ్బులు వసూలు చేశాడు. మోసపోయినట్లు గుర్తించిన బాధితులు సైబర్‌క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. ఆశిష్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.
చదవండి:
భక్తుల అనుమతిపై టీటీడీ కీలక నిర్ణయం..
తెలంగాణలో ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement