తనపై ఉమ్మిపడిందని వాగ్వాదం.. క్షణికావేశంలో.. | Fight Over Spitting Of Paan Turns Ugly As Man Pays With Life In Bihar | Sakshi
Sakshi News home page

తనపై ఉమ్మిపడిందని వాగ్వాదం.. క్షణికావేశంలో..

Nov 1 2021 9:03 PM | Updated on Nov 1 2021 9:18 PM

Fight Over Spitting Of Paan Turns Ugly As Man Pays With Life In Bihar - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పట్నా(బిహార్‌): క్షణికావేశంలో జరిగే సంఘటనలు ఒక్కొసారి వ్యక్తుల ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తుంటాయి. ఇలాంటి సంఘటనలు మనం వార్తలలో చదువుతుంటాం. ఇలాంటి ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సివాన్‌జిల్లాలోని పోఖ్రాప్రాంతంలో అహ్సాన్‌ మాలిక్‌ అనేవ్యక్తి.. వీధిలో బట్టల వ్యాపారం చేస్తుండేవాడు. అదే ప్రాంతంలో.. రెండో అంతస్థులో తన మిత్రులతో కలిసి ఉండేవాడు.

ఈ క్రమంలో ఒకరోజు తన ఇంట్లోని బాల్కని ఉన్న కిటికీ నుంచి అనుకోకుండా పాన్‌తిని కిందకు ఉమ్మివేశాడు. అది కాస్త.. కింద నిలబడిన ఒక వ్యక్తిపై పడింది. అతను కోపంతో ఊగిపోయి​.. అహ్సాన్‌ ఇంటికి వెళ్లాడు. అతడితో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా క్షణికావేశంలో అహ్సాన్‌ మాలిక్‌ను కాల్చిచంపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. కాగా, బుల్లెట్‌ శబ్దం రావడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 

చదవండి: హరియాణా ఆవిర్భావ దినోత్సవం: ఖైదీలకు సీఎం ఖట్టర్‌ తీపికబురు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement