హృదయ విదారక ఘటన.. కన్న బిడ్డల్ని హత్య చేసి..

Father Commits Suicide After Killing Children In YSR District - Sakshi

ప్రొద్దుటూరు క్రైం(వైఎస్సార్‌ జిల్లా): కన్న బిడ్డల్ని గొడ్డలితో నరికి, తండ్రి ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని నక్కలదిన్నె గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. నక్కలదిన్నె గ్రామానికి చెందిన నరసింహారెడ్డి (47) పురుగు మందుల కంపెనీలో సేల్స్‌ మేనేజర్‌గా పనిచేసేవాడు.

ఇతనికి భార్య తులసమ్మ, కుమారుడు అభితేజారెడ్డి, కుమార్తె పావని ఉన్నారు. నరసింహారెడ్డి మానసిక ఆరోగ్య సమస్య వల్ల పనికి వెళ్లడం లేదు.  ఐదు నెలల క్రితం అతనికి పిత్తాశయానికి సంబంధించిన ఆపరేషన్‌ జరిగింది. అప్పటి నుంచి గ్రామంలో ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండేవాడు. శుక్రవారం అర్దరాత్రి పురుగుల మందు తాగిన నరసింహారెడ్డి భార్య పడుకున్న గది తలుపునకు చిలుకు పెట్టాడు.
చదవండి: ఇంత­కీ ఏమిటా కుక్కుట శాస్త్రం.. అది ఏం చెబుతోంది?

కొంత సేపటి తర్వాత ఇంట్లో గొడ్డలి తీసుకుని ముందుగా నిద్రిస్తున్న కుమారుడు అభితేజరెడ్డి తలపై బలంగా కొట్టడంతో రక్తపు మడుగులో కుప్పకూలి పోయాడు. తర్వాత కుమార్తె పావనిపై కూడా గొడ్డలితో దాడి చేశాడు. పిల్లలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పిల్లలను, పురుగుమందు తాగిన నరసింహారెడ్డిని ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు నరసింహారెడ్డి మృతి చెందినట్లు నిర్ధారించారు. అభితేజరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. తన భర్త మానసిక స్థితి సరిగా లేక పిల్లలపై దాడి చేసి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడని భార్య తులశమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top