తండ్రి తుపాకితో ఆడుకుంటూ...పసికందుని కాల్చి చంపిన మైనర్‌

An Eight Year Old Boy Shot Dead A Baby With His Father Gun - Sakshi

US Boy Playing With His Father Gun: ఎనిమిదేళ్ల బాలుడు తండ్రి తుపాకితో ఆడుకుంటూ...అనుకోకుండా జరిపిన కాల్పుల్లో పసికందు మృతి చెందింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం....45 ఏళ్ల రోడెరిక్ రాండాల్‌ తుపాకిని కలిగి ఉండకుండా నిషేధింపబడిన నేరచరిత్ర కలిగిన వ్యక్తి. ఒక రోజు అతను తన కొడుకుతో కలిసి తన స్నేహితురాలిని కలిసేందుకు మోటెల్‌ ప్రాంతానికి వెళ్లాడు. అతడి స్నేహితురాలు తన ఇద్దరు కలలు, ఒక ఏడాది కుమార్తెతో అక్కడకి వచ్చింది.

ఆ సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. వాళ్లంతా కలుసుకుని కాసేపు ఆనందంగా గడిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఏదో పని పై రాండల్‌ బయటకి వెళ్లాడు. ఇంతలో కొడుకు అలమరాలో దాచిన తుపాకీని తీసి ఆడుకుంటున్నాడు. అదే సమయంలో బాలికల తల్లి నిద్రిస్తుంది. అంతే ఆ పిల్లాడు ఆ గన్‌తో ఆడుకుంటూ..ఆడుకుంటూ ఒక రౌండ్‌ కాల్పులు జరిపాడు. అంతే అక్కడే ఉన్న పసికందు శరీరంలోకి తూట దూసుకుపోయింది. అక్కడికక్కడే ఆ పసికందు మృతి చెందింది. ఐతే ఇలాంటి దారుణ ఘటనలు యూఎస్‌లో ఏటా కోకొల్లలు. పెద్దలు దాచిన గన్‌ని పిల్లలు తెలుసుకుని ఆడుకుంటూ తమను కాల్చుకోవడం లేదా తమ తోటివారిని కాల్చడం జరుగుతోంది.

ఇలా ఏటా మైనర్లు హత్యలు చేయడం...తెలిసి తెలియని వయసులో జైలు పాలుకావడం జరుగుతోందని, ప్రతి ఏడాది సగటున ఇలాంటి ఘటనలల్లో 350 మందికి పైగా మృతి చెందుతున్నారని యూఎస్‌ పోలీసులు చెబుతున్నారు. సదరు వ్యక్తి పై నిర్లక్ష్యం, చట్ట విరుద్ధంగా ఆయుధాన్ని కలిగి ఉండటం తదితర ఆరోపణలతో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇటీవలే యూఎస్‌ అత్యున్నత న్యాయస్థానం న్యూయార్క్‌ పౌరులు తమ వెంట గన్‌లు తీసుకువెళ్లొచ్చు అంటూ సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున సర్వత్రా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సాక్షాత్తు దేశ అధ్యక్షుడు జోబైడెన్‌ సైతం న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పైగా ఇది రాజ్యాంగానికి, ఇంగిత జ్ఞాననికి విరుద్ధంగా ఉందంటూ ఆవేదన చెందారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అమెరికా అత్యున్నత న్యాయస్థానం ఇలాంటి తీర్పులు ఇవ్వడం అత్యంత బాధకరం.

(చదవండి: శిథిలాల నడుమ అయిన వాళ్ల కోసం.. గుండెల్ని పిండేస్తున్న ఫొటో)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top