చిన్నారి ప్రాణం తీసిన వాటర్‌ హీటర్‌ | Current Heater Shock Boy Deceased In Tamil Nadu | Sakshi
Sakshi News home page

హీటర్‌ ఉన్న బకెట్‌లో చేయిపెట్టి బాలుడు మృతి

Apr 26 2021 8:33 AM | Updated on Apr 26 2021 11:18 AM

Current Heater Shock Boy Deceased In Tamil Nadu - Sakshi

తిరువళ్లూరు: వేడి నీళ్ల కోసం ఉంచి హీటర్‌ను  తాకి, విద్యుత్‌ షాక్‌కు గురై, తీవ్రంగా గాయపడిన బాలుడు మృతి చెందిన సంఘటన ఆదివా రం ఉదయం అదిగత్తూరు లో జరిగింది. పోలీసుల కథ నం మేరకు.. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌ అదిగత్తూరు గ్రామానికి చెందిన వినాయగం, నిషాంతి దంపతులకు కుమారుడు అవినాష్‌(7) ఉన్నాడు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు వినాయగం వేడి నీళ్ల కోసం బకెట్‌లో నీటిని ఉంచి అందులో హీటర్‌ పెట్టి నిద్రపోయాడు. అవినాష్‌ అడుకుంటూ వెళ్లి, హీటర్‌ ఉన్న బకెట్‌లో చేయి పెట్టడంతో విద్యుత్‌ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డారు.

దీంతో బాలుడిని తల్లిదండ్రులు తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, బాలుడ్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు. ఈ సంఘటన స్థానికంగా విషాదం నింపింది. రాత్రంతా తమతో పాటు ఆడుకుంటూ ఉన్న బిడ్డ మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.  ఈ విషయమై వినాయగం ఫిర్యాదు మేరకు కడంబత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: హైదరాబాద్‌లో నలుగురి యువతుల అదృశ్యం కలకలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement