మహమ్మారిని జయించి: తల్లి మరణ వార్త విని బాలింత మృతి

Covid Positive Woman Delivers Baby Deceased Her Mother Demise Vijayawada - Sakshi

తల్లి మరణ వార్త విని బాలింత మృతి 

గర్భిణిగా ఉన్నప్పుడు కరోనా సోకినా

 జాగ్రత్తలతో విజయవంతంగా డెలివరీ 

సంతోషంగా ఇంటికి వచ్చి పెను విషాదాన్ని మిగిల్చిన వైనం 

తల్లి లేని వాడైన 16 రోజుల పసికందు 

అజిత్‌సింగ్‌నగర్‌(విజయవాడ సెంట్రల్‌): యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని ఆ నిండు గర్భిణి జయించింది.. పండంటి మగబిడ్డకు జన్మచ్చింది. అంతా బాగుంది అనుకుని ఇంటికి వచ్చిన ఆ తల్లికి ఓ చేదునిజం  చెవిన పడడంతో దాన్ని జీర్ణించుకోలేకపోయింది. తనను నవమాసాలు మోసి, కనిపెంచిన కన్నతల్లి కరోనా కాటుకు బలైందని తెలియడంతో ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందింది. దీంతో 16 రోజుల పసికందు తల్లిలేని వాడయ్యాడు. న్యూరాజరాజేశ్వరీపేటలో చోటుచేసుకున్న ఈ విషాధ ఘటన స్థానికులందరిని కన్నీటిపర్వంతమయ్యేలా చేసింది. సేకరించిన వివరాలు ఇవి.. 

పగబట్టిన ‘కరోనా’..! 
సింగ్‌నగర్‌ ఎంకే బేగ్‌ స్కూల్‌ ప్రాంతానికి చెందిన వెంకటేశ్వరరావు, రమాదేవి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు సంతానం ఉన్నారు. వెంకటేశ్వరరావు బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేసి కొంతకాలం క్రితం పదవీ విరమణ చేసి ఇంటి వద్దే ఉంటున్నారు. వీరి చిన్న కుమార్తె ప్రమీలా తనతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో పనిచేసే న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన గణేష్‌ అనే యువకుడిని గతేడాది ప్రేమించి పెళ్లిచేసుకుంది. గర్భిణి కావడంతో మూడు నెలల కిందట పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉంటుంది. 

అయితే గత నెలలో ఆ ఇంటి మొత్తానికి కరోనా రావడంతో ప్రమీలా కూడా కోవిడ్‌ బారిన పడింది. నిండు గర్భిణి కావడంతో తనకు పుట్టబోయే బిడ్డ కోసం ప్రమీలా చాలా ధైర్యంగా నిలబడి కరోనాను జయించింది. 16 రోజుల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 14 రోజుల పాటు హాస్పిటల్‌లో చికిత్స చేయించుకున్న ఆమె రెండు రోజుల క్రితమే న్యూఆర్‌ఆర్‌పేటలోని తన అత్తగారింటికి వచ్చింది. 

తల్లి మృతిని భరించలేక.. 
ప్రమీలా తల్లి రమాదేవి కరోనాతో పోరాడుతూ సోమవారం మధ్యాహ్నం చనిపోయింది. పెద్ద ఆపరేషన్‌ చేయించుకొని ఉండడంతో ప్రమీలకు తన తల్లి మరణవార్త తెలియకుండా అందరూ జాగ్రత్తపడ్డారు. అయితే మంగళవారం ఉదయం తన తల్లి మృతిచెందిన విషయం తెలియడంతో ప్రమీల ఒక్కసారిగా తీవ్ర ఆవేదనకు లోనైంది. పెద్ద ఆపరేషన్‌ చేయించుకొని ఉండటం, తల్లి మరణవార్తను జీర్ణించుకోలేకపోవడంతో ఒక్కసారిగా అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించేందుకు ప్రయత్నించినప్పటికి మార్గం మధ్యలోనే ఆమె మృతిచెందింది. 

ఆనందం.. అంతలోనే విషాదం.. 
తన భార్య ప్రమీల కరోనాని జయించడంతో పాటు చక్కని మగబిడ్డకు జన్మనిచ్చి ఇంటికి రావడంతో గణేష్‌ కుటుంబ సభ్యుల ఆనందంతో ఆ ఇళ్లంతా నిండిపోయింది. అయితే ఆ సంతోషం రెండు రోజుల ముచ్చటగానే మారి వారికి తీరని విషాదాన్ని మిగిల్చింది. మరో వైపు ప్రమీల తండ్రి వెంకటేశ్వరరావు కూడా మృత్యువుతో పోరాడుతున్నాడు.    

చదవండి: ఏం జరిగిందో ఏమో.. యువతి అనుమానాస్పద మృతి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

12-05-2021
May 12, 2021, 12:50 IST
సాక్షి, శ్రీకాకుళం: క‌రోనా వైరస్‌ బారిన ప‌డిన ఆంధ్రప్రదేశ్‌ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం దంపతులు పూర్తి చికిత్స అనంత‌రం సంపూర్ణంగా కోలుకున్నారు....
12-05-2021
May 12, 2021, 11:48 IST
కరోనా సెకండ్‌ వేవ్‌ సెలబ్రిటీల మీద కన్నేసినట్లుంది. ఈ ఏడాది ఎంతోమంది సినీప్రముఖులకు కరోనా సోకింది. ఈ క్రమంలో పలువురూ...
12-05-2021
May 12, 2021, 11:24 IST
నాకసలు కరోనా రాలేదు. ఈ పుకార్లు ఎవరు సృష్టిస్తున్నారో, ఏ ఉద్దేశ్యంతో వాటిని ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ...
12-05-2021
May 12, 2021, 10:03 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గత నాలుగు రోజుల నుంచి కొత్త కోవిడ్‌ కేసుల...
12-05-2021
May 12, 2021, 09:47 IST
నాతో పాటు మా ఇంట్లో ఆరుగురికి కరోనా సోకింది. కరోనా సోకిన తర్వాత నా కుమారుడి పరిస్థితి ఓ సందర్భంలో కలవరపెట్టింది... ...
12-05-2021
May 12, 2021, 04:41 IST
సాక్షి, తిరుపతి: తిరుపతి రుయా ఆస్పత్రిలో రోజువారీ సహజ మరణాలపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. రెండురోజులుగా సహజంగా మరణించినవారు కూడా.....
12-05-2021
May 12, 2021, 04:34 IST
సాక్షి, అమరావతి: కరోనాతో మృతి చెందిన వారిని అయిన వాళ్లే వదిలేసినా..వారి అంత్యక్రియలను పోలీసులు అన్నీ తామై చేయిస్తూ మానవత్వం...
12-05-2021
May 12, 2021, 04:30 IST
గుడ్లవల్లేరు (గుడివాడ): ఇంటి పట్టునే ఉంటే కరోనా సోకదని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో పెదపాలెం గ్రామస్తులు అదే మాటను కట్టుబాటుగా చేసుకున్నారు....
12-05-2021
May 12, 2021, 03:46 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ చికిత్సలకు చెల్లించే ఆరోగ్యశ్రీ రేట్లను సవరిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మంగళవారం ఉత్తర్వులు...
12-05-2021
May 12, 2021, 03:27 IST
కోవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. బాధాకరమైన ఘటనలు కూడా జరుగుతున్నాయి. నిన్న (సోమవారం రాత్రి) తిరుపతి రుయా ఆస్పత్రిలో...
12-05-2021
May 12, 2021, 03:08 IST
సాక్షి, అమరావతి: అవసరమైన మేరకు ఆక్సిజన్‌ను కేటాయించి కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీకి...
12-05-2021
May 12, 2021, 02:28 IST
న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌ నెమ్మదించినట్లు కనిపిస్తోందని, అయితే, పూర్తిగా కిందకు దిగిరావడానికి మరింత సమయం పడుతుందని ప్రముఖ వైరాలజిస్ట్‌...
11-05-2021
May 11, 2021, 21:04 IST
మధ్యాహ్నం కేబినెట్‌ భేటీ ఉందని, సమావేశం అనంతరం లాక్‌డౌన్‌, కర్ఫ్యూపై వివరాలు సమర్పిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు.
11-05-2021
May 11, 2021, 20:21 IST
పవిత్ర గంగా నదిలో తేలుతున్న మృతదేహాల  కలకలం  పుట్టిస్తున్నాయి.
11-05-2021
May 11, 2021, 19:11 IST
తాజాగా నమోదవుతున్న కేసులు డిశ్చార్జ్‌ల కన్నా తక్కువగా ఉంటున్నాయి. తెలంగాణ తాజా కరోనా బులెటిన్‌ విడుదల.
11-05-2021
May 11, 2021, 18:13 IST
కోల్‌కతా: కరోనా విజృంభిస్తోంది. ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ వంటి కఠిన ఆంక్షలు విధించినప్పటికి మహమ్మారి అదుపులోకి రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో...
11-05-2021
May 11, 2021, 17:29 IST
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో రెండో దశలో కరోనా మహమ్మారి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. అయితే ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న అంచనాలను బట్టి ఓ,...
11-05-2021
May 11, 2021, 17:13 IST
సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి..ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. ఆక్సిజన్‌ కేటాయింపులు, సరఫరాపై లేఖలో...
11-05-2021
May 11, 2021, 15:42 IST
త్రిసూర్‌:  కరోనా మహమ్మారి  సినీ రంగంలో పెనువిలయాన్ని సృష్టిస్తోంది. పలువురు సినీ రంగానికి చెందిన కరోనా బారిన పడి అసువులు బాశారు. మలయాళ...
11-05-2021
May 11, 2021, 15:30 IST
ఢిల్లీ: చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) బ్యాటింగ్‌ కోచ్‌ మైఖేల్‌ హస్సీకి మళ్లీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శనివారం నిర్వహించిన...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top