పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణహత్య | Christian Girl Assasinated For Rejecting Muslim Man Marriage Proposal | Sakshi
Sakshi News home page

పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణహత్య

Dec 6 2020 4:20 PM | Updated on Dec 6 2020 4:28 PM

Christian Girl Assasinated For Rejecting Muslim Man Marriage Proposal - Sakshi

రావల్పిండి : పాకిస్తాన్‌లో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. ముస్లిం వ్యక్తి పంపిన వివాహ ప్రతిపాదనను తిరస్కరించిన కారణంగా క్రైస్తవ యువతి దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన  రావల్పిండిలోని కోరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో  చోటుచేసుకుంది.

అసలు విషయంలోకి వెళితే.. కోరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసించే షెహజాద్‌ అనే యువకుడు స్థానికంగా నివసిస్తున్న క్రైస్తవ యువతిని  ఇష్టపడ్డాడు. దీంతో యువతిని పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులకు ప్రతిపాదన పంపాడు. అయితే యువతి కుటుంబసభ్యులు అందుకు తిరస్కరించడంతో షెహజాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా యువతికి ఫైజాన్‌ అనే యువకుడితో వివాహం జరిపిస్తున్నట్లు తెలుసుకున్న షెహజాద్‌ మరింత కోపం పెంచుకున్నాడు.

మరుసటి రోజు సదరు యువతి ఫైజాన్‌ బైక్‌పై వెళ్తుండగా గమనించిన షెహజాద్‌ ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయాడు. దీంతో యువతి అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఫైజాన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వ్యక్తిగత కోపంతోనే షెహజాద్‌ యువతిని హత్య చేసినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తెలినట్లు  డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement