
పెడన: కోర్టుల్లో పోస్తుల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఆన్‌లైన్ పరీక్షల్లో ప్రశ్నపత్రం లీక్ చేసేందుకు యత్నించి అరెస్టయిన ముగ్గురు నిందితుల నుంచి పోలీసులు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించడంతో మచిలీపట్నం సబ్ జైలుకు పంపించినట్టు కృష్ణాజిల్లా పెడన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్.ప్రసన్నవీరయ్యగౌడ్ తెలిపారు.
ఇప్పటికే వారి ఫోన్‌లో ప్రశ్న పత్రానికి సంబంధించిన ఫోటోలను వాటి జిరాక్స్ కాపీలను తీయించడంతో పాటు ఆ ఫోన్లను ఫోరెన్సిక్ (ఎఫ్‌ఎస్‌ఎల్)ల్యాబ్‌కు పంపించినట్లు చెప్పారు. నివేదిక వచ్చేందుకు నెల రోజుల సమయం పడుతుందని, రాగానే ఛార్జిషీట్ దాఖలు చేస్తామని వివరించారు.