వెయ్యి బస్సుల కొనుగోలుపై సీబీఐ దర్యాప్తు

CBI to probe irregularities in purchase of 1000 low floor buses - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం వెయ్యి బస్సుల  కొనుగోలుకు చేసుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందని ఆరోపణలపై సీబీఐతో ప్రాథమికంగా దర్యాప్తు చేయించాలని హోం శాఖ సిఫారసు చేసింది. ఢిల్లీ రవాణా శాఖ బస్సుల కొనుగోలు,  వార్షిక నిర్వహణ కాంటాక్టు (ఏఎంసీ)ల్లో అవినీతి జరిగిందంటూ ప్రతిపక్ష బీజేపీ ఆరోపించగా, దీనిపై విచారణకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) అనిల్‌ బైజాల్‌ ఆదేశాల మేరకు ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటైంది. ఏఎంసీలో విధానపరమైన లోపాలున్నాయని, దానిని రద్దు చేయాలంటూ ఆ కమిటీ సిఫారసు చేసింది. దాంతో దీనిపై సీబీఐతో విచారణకు హోంశాఖ ఆదేశించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top