Prawns Trader Kodanda Rama Rao Murder In Khammam | రొయ్యల వ్యాపారి దారుణ హత్య - Sakshi
Sakshi News home page

రొయ్యల వ్యాపారి దారుణ హత్య

Feb 16 2021 12:33 PM | Updated on Feb 16 2021 6:19 PM

Businessman Kodanda Rama Rao Assassination In Khammam District - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: నాలుగు రోజుల క్రితం కిడ్నాపైనా రొయ్యల వ్యాపారి కోదండ రామారావు దారుణ హత్యకు గురయ్యారు. భీమవరం బలుసుమూడికి చెందిన రామారావును ఖమ్మం జిల్లా అశ్వరావుపేట అటవీ ప్రాంతంలో దారుణంగా హత్య చేశారు. నగదు లావాదేవీలే హత్యకు గల కారణాలుగా పోలీసులు భావిస్తున్నారు. కాళ్ల మండలం దొడ్డనపూడికి చెందిన వీరాస్వామి, కోదండ రామారావుల మధ్య రొయ్యల వ్యాపారం విషయంలో కొద్ది రోజులుగా వివాదాలు నడుస్తున్నాయని సమాచారం. వీరస్వామి, గుమస్తా మోహన్‌లపై మృతుడి బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.

చదవండి: బంపరాఫర్.. ఆ తర్వాత ఫోన్‌ స్విచ్‌ ఆఫ్
విషాదం: దోశ పిండి నీలాగే ఉందనడంతో

 

Advertisement
 
Advertisement
Advertisement