భార్యను రక్షించడం కోసం పోలీసులకే కట్టుకథ

మథురై : ఉత్తరప్రదేశ్‌లోని మధుర జనపథ్ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌కు సోమవారం రాత్రి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్‌లో అవతలి వ్యక్తి మాట్లాడుతూ.. మా బస్సు హైజాక్‌కు గురైందని.. వెంటనే వచ్చి మమ్మల్ని కాపాడాలంటూ సమాచారమిచ్చాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై అక్కడికి చేరుకొని బస్సును ఆపారు. అయితే అసలు విషయం తెలుసుకొని పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు.
వివరాలు.. మథురై నుంచి బస్సులో వెళ్తున్న మహిళా ప్రయాణికురాలు నౌహ్జీల్ పరిధిలోని బజ్నాకు చేరుకునేసరికి ఒక ప్రయాణికునిపై అనుమానం వ్యక్తం చేస్తూ తన భర్తకు ఫోను చేసింది. తనను అనుమానంగా చూస్తున్నాడని.. భయమేస్తుందని భర్తకు చెప్పింది. దీంతో ఆమె భర్త పోలీసులకు ఫోను చేసి, బస్సు హైజాక్ అయిందంటూ కట్టుకథ అల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తన భార్యను రక్షించుకోవడం కోసం బస్సు హైజాక్ అయిందంటూ నాటకమాడిన సదరు వ్యక్తిని చట్ట నియమాలను ఉల్లఘించినందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.(చదవండి : ప్రకాశం బ్యారేజీలో దూకి యువకుడు ఆత్మహత్య)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి