ప్రియునితో సహజీవనం.. వారిమధ్య ఏం జరిగిందో గానీ..

మైసూరు(బెంగళూరు): ప్రియునితో కలసి సహజీవనం చేస్తున్న శోభ (40) అనే మహిళ అనుమానాస్పద రీతిలో మరణించింది. ఈ ఘటన హెచ్‌డీ కోటలో జరిగింది. కొన్నేళ్లుగా భర్త నుంచి విడిపోయిన శోభ ఒంటరిగా ఉంటోంది. ఈ సమయంలోనే మంజునాథ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ఇద్దరూ సహజీవనం చేయసాగారు.
మంజునాథ్ మద్యానికి బానిసై తరచూ శోభతో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం చూడగా శోభ ఉరివేసుకుని ఉన్న స్థితిలో శవమైంది. ఇది తెలిసి ప్రియుడు పరారయ్యాడు. శోభ కుమార్తె పూజా మంజునాథ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరో ఘటనలో..
టెన్త్ బాలిక ఆత్మహత్య
హోసూరు: హోసూరు పారిశ్రామికవాడ జూజువాడికి చెందిన సైందవి (15) అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఆదివారం ఇంటి నుంచి బయటకెళ్లి తిరిగి వచ్చింది. బయటకెళ్లరాదని తల్లిదండ్రులు మందలించడంతో సైందవి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. సిఫ్‌కాట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.