అడల్ట్‌ కంటెంట్‌ వ్యసనం.. ఆన్‌లైన్‌ ప్రియురాలు.. కోరికల కోసం కోటి స్వాహా

Accountant Used 1 Company Account To Watch Adult Content And Lover Gujarat - Sakshi

అహ్మ‌దాబాద్: చెడు అలవాట్లు వ్యసనంగా మారడంతో ఓ వ్యక్తి జీవితాన్ని నాశనం అయ్యింది. ఇంట‌ర్‌నెట్‌లో అశ్లీల కంటెంట్‌ వ్యసనంతో పాటు ఆన్‌లైన్‌లో పరిచయమైన మ‌హిళ కోరిక‌లు తీర్చేందుకు ఓ వ్య‌క్తి త‌న య‌జమానిని మోస‌గించి కోటి వరకు స్వాహా చేశాడు. ఈ ఘ‌ట‌న గుజరాత్‌లో వెలుగుచూసింది. ఈ కేసుకు సంబంధించి నిందితుడితో పాటు మ‌రో ఇద్ద‌రిని రాజ్‌కోట్‌లో అరెస్ట్ చేశారు. (చదవండి: ప్రియురాలు పని చేసే చోట దొంగతనం.. పాపం పోవాలని పూజలు.. )

వివరాల ప్రకారం.. తుషార్ సెజ్‌పాల్‌ అనే వ్యక్తి, గ్రాఫిక్ డిజైనర్ అయిన ఇర్ఫాన్ షేక్ చెందిన సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. పోర్న్‌కు బానిసగా మారిన సెజ్పాల్, ఇంటర్నెట్‌లో అడల్ట్ మూవీస్ చూడటానికి సంస్థ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.16 లక్షలు వరకు వాడుకున్నాడు. అంతేగాక ఇటీవల ఆన్‌లైన్‌లో ఓ మహిళతో పరిచయం ఏర్పడడం అతని జీవితాన్నే మార్చేసింది. ఆమె పరిచయం అయిన కొన్ని రోజులకు ప్రియురాలుగా మారింది. సెజ్‌పాల్ బ‌ల‌హీన‌త‌ను ప‌సిగ‌ట్టిన ఆ మహిళ అత‌ని నుంచి ప‌ల‌మార్లు డ‌బ్బులు రాబట్టింది. 

అనేక సందర్భాల్లో ఆమె కోరిక మేరకు ఎంత డబ్బు అడిగితే అంత ట్రాన్స్‌ఫర్‌ చేసేవాడు సెజ్‌పాల్‌. అలా ఇప్పటి వరకు అతను ఇర్ఫాన్ సంస్థ బ్యాంక్ ఖాతా నుంచి రూ.85 లక్షల మొత్తాన్ని బదిలీ చేశాడు. చివ‌రికి ఇర్ఫాన్ కొనుగోలు చేసిన ఇంటి ఈఎంఐల‌ను కూడా చెల్లించ‌కుండా ఆ మొత్తాన్ని కూడా సెజ్‌పాల్ త‌న ప్రియురాలు ఖాతాకు మ‌ళ్లించాడు. అలా సెజ్‌పాల్ రూ.కోటి దాకా సంస్థ డబ్బుని తన సొంతానికి ఉపయోగించాడు. చివరకు ఈ విషయం ఇర్ఫాన్‌కు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా సెజ్‌పాల్‌, తన ప్రియురాలు ఆమె త‌ల్లి స‌హా ఏడుగురిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

చదవండి: Uthra Murder Case: కసాయి భర్త కేసులో కోర్టు సంచలన తీర్పు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top