అమ్మాయితో వీడియో కాల్‌.. లైవ్‌లో దుస్తులిప్పి..

Man Strips On Video Call With Friend Cheated In Bengaluru - Sakshi

బెంగళూరు : మాట్రిమోనియల్‌ సైట్‌ ద్వారా పరిచయమైన ఓ యువతిని గుడ్డిగా నమ్మి మోస పోయాడో యువకుడు. వీడియో కాల్‌లో దుస్తులిప్పి అడ్డంగా బుక్కయ్యాడు. కర్ణాటకలోని బెంగళూరు నగరంలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. బెంగళూరు, హులిమావుకు చెందిన 33 ఏళ్ల అంబిత్‌ కుమార్‌ మిశ్రాకు కొద్దిరోజుల క్రితం మాట్రిమోనియల్‌ సైట్‌ ద్వారా శ్రేయ అనే యువతి పరిచయమైంది.

తానో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌నని, ఎలక్ట్రానిక్‌ సిటీలో పనిచేస్తున్నానని ఆమె చెప్పింది. అంబిత్‌ను పెళ్లి చేసుకోవాలన్న కోరికను ప్రకటించింది. దీంతో ఇద్దరూ ఫోన్‌ ద్వారా తరచూ మాట్లాడుకునే వారు. ఫిబ్రవరి 7వ తేదీన వాట్సాప్‌ వీడియోకాల్‌ చేయాల్సిందిగా శ్రేయ, అంబిత్‌ను కోరింది. దీంతో అతడు వీడియో కాల్‌ చేశాడు. మొదట ఇద్దరి ఉద్యోగాల గురించి మాట్లాడుకున్నారు. ( మాయమైపోతున్న మనిషి! )

ఆ తర్వాత ఆమె తన దుస్తులు మొత్తం తొలగించి నగ్నంగా అతడి ముందు నిలబడింది. అంబిత్‌ను కూడా దుస్తులు తీసేయమని కోరింది. ఆమె చెప్పినట్లుగానే అతడు దుస్తులు తీసేశాడు. దీన్నంతా వీడియో రికార్డింగ్‌ చేసింది. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తానని, అలా చేయకుండా ఉండాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని బ్లాక్‌ మెయిల్‌ చేసింది. దీంతో అదే రోజు 20 వేల రూపాయలు చెల్లించాడు.

ఆమె అంతటితో ఆగలేదు. డబ్బుకోసం మళ్లీ, మళ్లీ ఇబ్బంది పెట్టసాగింది. ఈ నేపథ్యంలో అంబిత్‌ పోలీసులను ఆశ్రయించాడు. శ్రేయపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నగరంనుంచి ఫోన్‌ చేసినట్లు గుర్తించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top