70 ఏళ్ల వృద్దురాలిపై అత్యాచారం, హత్య

70 Years Old Lady Abuse Homicide In Bhopal City - Sakshi

భోపాల్‌: ఎన్ని చట్టాలు చేసిన, నిందితులని ఉరి తీస్తున్న దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఆగడంలేదు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని పురాతన నగరం విదిశలో 70 ఏళ్ల వృద్దురాలిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. వృద్దురాలి సొంత వ్యవసాయ క్షేత్రంలో గురువారం ఉదయం మృతదేహన్ని కనుగొన్నారు. బుధవారం రాత్రి పొలానికి కాపలాకి వెళ్లిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె శరీరంలోని రహస్యప్రదేశాలలో తీవ్ర గాయాలున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top