వృద్ధురాళ్లపై లైంగిక దాడి.. నిందితుల్లో 22 ఏళ్ల వ్యక్తి 

70 Year Old Woman Molestation By Drunk Man In Fatehpur And 98 Year Old In Ballia In UP - Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని ఫతేపూర్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తాగిన మైకంలో 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  అలాగే బల్లియా జిల్లాలో 98 ఏళ్ల వృద్ధురాలిపై మరో వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.  వివరాల్లోకి వెళితే.. ఓ 70 ఏళ్ల యాచకురాలు తరిణవ్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాల భవనంలో నిద్రించేది.ఈ క్రమంలో ఆదివారం రాత్రి లక్ష్మీ లోధి(32) మద్యం మత్తులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

చదవండి: మహిళా పూజారి దారుణ హత్య. 38 రోజుల్లో నాలుగు హత్యలు

అంతే కాకుండా బల్లియా జిల్లాలో 22 ఏళ్ల వ్యక్తి 98 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.  కాగా ఆగస్టు 20న సోను అనే నిందితుడు తనపై అత్యాచారానికి ప్రయత్నించినట్లు ఆ వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఈ ఘటనపై మొదట కేసు నమోదు చేయడానికి నిరాకరించారని, కానీ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్షలు రావడంతో కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు కుటుంబ సభ్యులు అన్నారు.

చదవండి: ఎంత వేధించిందో: పెళ్లాం వేధింపులు తట్టుకోలేక పోలీస్‌స్టేషన్‌కే నిప్పు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top