16 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచార యత్నం

60 Years Old Man Attempting Rape On 11 Yers Girl In Karimnagar  - Sakshi

సాక్షి, మల్లాపూర్‌(కరీంనగర్‌): జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలోని ఓ గ్రామంలో బాలిక(16) ఓ వృద్ధుడు అత్యాచారానికి యత్నించాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. బాలిక రెండ్రోజుల క్రితం కిరాణానికి సరుకుల కోసం వెళ్లింది. అదే సమయంలో వృద్ధుడు(60) అక్కడికి వచ్చి బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా అత్యాచారానికి యత్నించాడు.

భయాందోళనకు గురైన బాలిక కేకలు వేసింది. దీంతో వృద్ధుడు అక్కడి నుంచి పరారయ్యాడు ఇంటికి వెళ్లిన బాలిక విషయం గురించి తల్లిదండ్రులకు చెప్పింది. వారు బాలికతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. వృద్ధుడిపై ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిసింది.  

చదవండి: హైటెక్ వ్యభిచారం.. తప్పించుకోవడానికి రహస్య మార్గం..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top