కోటిన్నర నగలు కొట్టేశారు.. బాలల నిర్వాకం, 4 గంటల్లో ఆటకట్టు | 3 boys steal gold, diamond jewellery worth crores from Chennai shop | Sakshi
Sakshi News home page

కోటిన్నర నగలు కొట్టేశారు.. బాలల నిర్వాకం, 4 గంటల్లో ఆటకట్టు

Nov 28 2022 6:00 AM | Updated on Nov 28 2022 11:34 AM

3 boys steal gold, diamond jewellery worth crores from Chennai shop - Sakshi

చెన్నై: చెన్నైలోని ఓ దుకాణం నుంచి రూ.1.50 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలను ఎత్తుకుపోయిన ముగ్గురు బాలురను పోలీసులు నాలుగు గంటల్లోనే పట్టుకున్నారు. అస్సాంకు చెందిన ఈ ముగ్గురు నగల దుకాణానికి సమీపంలోని జ్యూస్‌షాప్‌లో పనిచేసేవారు. పథకం ప్రకారం వారు..లిఫ్టు పక్కనున్న ఖాళీ స్థలం గుండా దుకాణంలోకి ప్రవేశించారు.

వారు లోపలికి చేరుకున్న వెంటనే సెక్యూరిటీ వ్యవస్థ ద్వారా దుకాణం యజమానికి వెంటనే ఉదయం 5 గంటలకు అలెర్ట్‌ చేరింది. అప్రమత్తమైన యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దుకాణం వద్దకు చేరుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా అప్పటికే పరారైన ముగ్గురి కోసం వేట మొదలుపెట్టి, నాలుగు గంటల్లోనే వారి ఆటకట్టించారు. 

Advertisement
 
Advertisement
Advertisement