‘నా భార్య కనిపించడం లేదు.. అతడి భార్యతో నా భర్త వెళ్లాడు’

2 Missing Cases Filed In Jubilee Hills Police Station - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: తన భార్య కనిపించడం లేదంటూ ఓ భర్త పోలీస్‌ స్టేషన్‌కు వచ్చాడు. అతడి భార్యతో తన భర్త వెళ్లాడంటూ మరో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన బి.నారాయణదాస్, మోనికా దాస్‌ దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. యూసుఫ్‌గూడ సమీపంలోని వెంకటగిరిలో నివాసం ఉంటున్న నారాయణదాస్‌ ప్లంబర్‌గా పని చేస్తుంటాడు. గతేడాది కాలంగా మోనికా దాస్‌ ఫోన్‌లో ఎండీ ఆసిఫ్‌ అనే వ్యక్తితో తరచూ మాట్లాడుతున్న విషయాన్ని గమనించిన భర్త నారాయణదాస్‌ మందలించాడు.

ఈ విషయంపై పెద్ద మనుషులు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమనిగింది. ఇదిలా ఉండగా ఈ నెల 24న భర్త ఇంట్లో లేని సమయంలో మోనికా దాస్‌ తన ఇద్దరు పిల్లలను తీసుకొని కోల్‌కతా వెళ్లిపోయింది. అక్కడ వాకబు చేయగా పిల్లలను తల్లి వద్ద వదిలేసి వెళ్లినట్లు తేలింది. వెంకటగిరిలో నివాసం ఉంటున్న ఆసిఫ్‌ కూడా ఆమెతో పాటు వెళ్లినట్లు తెలుసుకున్న భర్త నారాయణదాస్‌ ఆదివారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో తన భర్త కనిపించడం లేదంటూ ఆసిఫ్‌ భార్య కూడా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

చదవండి: బార్‌లో వ్యభిచారం.. ఇద్దరు యువతులు, నిర్వాహకుల అరెస్ట్‌
కొంప ముంచిన ఆర్‌ఎంపీ వైద్యం.. బాలిక పరిస్థితి విషమం..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top