ఘోర రోడ్డు ప్రమాదం: మృతుల్లో ఆరుగురు చిన్నారులు | 14 People Assassinated In A Road Accident In UP | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం: 14 మంది మృతి

Nov 20 2020 7:35 AM | Updated on Nov 20 2020 10:48 AM

14 People Assassinated In A Road Accident In UP - Sakshi

ప్రమాదంలో నుజ్జునుజ్జైన బొలెరో వాహనం

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం ట్రక్‌ను ఢీకొన్న ఘటనలో 14మంది మృత్యువాతపడ్డారు. గురువారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది.  ప్రయాగరాజ్‌-లక్నో హైవేపై వెళుతున్న బొలెరో.. ట్రక్‌ను ఢీకొట్టింది. దీంతో వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న 14 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. రోడ్డు ప్రమాదంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement