శ్రీవారి ప్రసాదాలు పరమ పవిత్రం | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి ప్రసాదాలు పరమ పవిత్రం

Sep 20 2026 6:36 AM | Updated on Sep 20 2026 6:36 AM

– మాజీ మంత్రి ఆర్కే రోజా

నగరి : తిరుమల శ్రీవారి బ్రహ్మో త్స వాలు అత్యంత వైభవంగా జరుగుతున్న వేళ శ్రీవారి ప్రసాదాల పవిత్రతపై మరోసారి స్పష్టత వచ్చిందని మాజీ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడా రు. శ్రీవారి ప్రసాదాలను అపవిత్రం చేసేందు కు, వాటిపై కళంకం అంటించేందుకు గతంలో జరిగి న ప్రయత్నాలు నిరాధారమని తాజా పరిణామా లు స్పష్టం చేస్తున్నాయని ఆమె అన్నా రు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వేళ శ్రీవారి ప్రసాదాల పవిత్రతపై నిజం మరోసారి నిర్ధారణ కావడం భక్తులకు సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. పవిత్రమైన శ్రీవారి ప్రసాదాలకు కళంకం అంటించే ప్రయత్నాలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారు ఇప్పటికై నా రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి చర్యలకు ముగింపు పలకాలని సూచించారు. జగనన్న మనసు పచ్చి పాలు లాంటిదని, పచ్చి పాలలో కల్తీకి ఆస్కారం ఉండదన్నారు.

21, 22 తేదీల్లో

సీఎం కుప్పం పర్యటన

కుప్పం: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజులు కుప్పంలో పర్యటిస్తున్నట్లు రాష్ట్ర ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎస్‌ మునిరత్నం, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి శ్రీకాంత్‌ తెలిపారు. పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో వారు ముఖ్యమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. ఆమేరకు సీఎం 21 తేదీ సోమవారం ఉదయం విజయవాడ నుంచి బెంగళూరు చేరుకుని, అక్కడి నుంచి ఉదయం 10.30 గంటలకు శాంతిపురం మండలం తుమ్మిసి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి వద్ద హాంద్రీ–నీవా కాలువలో జల హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కుప్పం పట్టణంలో రైతు బజార్‌ శుంకుస్థాపన చేపట్టి, పక్క నే ఉన్న కొత్తపేటలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి శాంతిపురం మండలం కడపల్లి వద్ద తన సొంత ఇంటికి చేరుకుంటారు. రాత్రి 9.45 గంటలకు కుప్పం రైల్వే స్టేషన్‌ చేరుకుని, కుప్పం మీదుగా కొత్తగా ప్రారంభమైన పాండిచ్చేరి రైలును ప్రారంభిస్తారు. తర్వాత కడపల్లిలోని తన స్వగృహంలో రాత్రి బస చేస్తారు.

రెండో రోజు బాబు పర్యటన

22 వ తేదీ మంగళవారం కడపల్లిలోని తన ఇంటి వద్ద ఉదయం ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటిలో హెచ్‌ఏఎం ప్రాజెక్టులు, ఏకో పౌల్ట్రీ షెడ్లను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.35 గంటలకు హెలీ ప్యాడ్‌కు చేరుకుని విజయవాడకు ప్రయాణమవుతారు.

పెంచిన మెస్‌ బిల్లులు తగ్గించండి

తిరుపతి సిటీ: ఎస్వీయూ వసతి గృహాల్లో ఎస్టాబ్లిష్‌మెంట్‌, మెయింటెనెన్స్‌, రూమ్‌ రెంట్‌ పేరుతో అక్రమంగా విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడం ఆపాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం వర్సిటీ ఎదుటగల అంబేడ్కర్‌ విగ్రహానికి వారు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్‌ మాట్లాడు తూ ఎస్వీయూలోని బాయ్స్‌ హాస్టళ్లకు సంబంధించి జూలై నెల మెస్‌ బిల్లు దాదాపు రూ.3వేల నుంచి రూ.4వేల వరకు పెంచడం దారుణమన్నారు. గతంలో యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థుల మెస్‌ బిల్లుల కోసం ప్రభుత్వం ప్రతి విద్యార్థికి సుమారు రూ.1,400 నుంచి రూ.2,500 వరకు హాస్టల్‌ ఖాతాకు నిధులు అందించేదని గుర్తుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement