సిద్ధార్థలో వైభవంగా ధన్వంతరి యజ్ఞం, తిరుప్పావడ సేవ | - | Sakshi
Sakshi News home page

సిద్ధార్థలో వైభవంగా ధన్వంతరి యజ్ఞం, తిరుప్పావడ సేవ

Sep 20 2026 6:54 AM | Updated on Sep 20 2026 6:54 AM

● హాజరైన కేంద్ర మంత్రి లోకనాఽథన్‌ మురుగన్‌

నారాయణవనం: స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలో నావాహ్నిక ‘విశ్వగురు మహా సంకల్ప సిద్ధి యాగం’లో భాగంగా శనివారం ఉద యం తిరుప్పావడ సేవను, సాయంత్రం ధన్వంతరి హో మాన్ని నిర్వహించారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహరాలు, సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి లోకనాథన్‌ మురుగన్‌ హోమంలో పాల్గొన్నారు. తమిళ పెరటాసి తొలి శనివారాన్ని పురస్కరించుకుని ఉదయం 8:30 గంటల నుంచి నాలుగు గంటల పా టు వేంకటేశ్వర స్వామికి వైభవంగా తిరుప్పావడ సేవను 115 హోమ గుండాలతో హోమ క్రతువుతో నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి రెండు గంటల పాటు ప్రవచనకర్త చంద్రశేఖరేంద్ర పరబ్రహ్మ భక్తులను ఉద్దేశించి ‘ఆధునికత, ఆధ్యాత్మికత సమన్వయం‘పై ప్రవచనం చేశారు. సాయంత్రం నిర్వహించిన ధన్వంతరి యజ్ఞంలో కేంద్ర మంత్రి లోకనాథన్‌ మురుగన్‌ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని క్షేమం, దీర్ఘాయుష్షు కోసం ‘విశ్వగురు మహాసంకల్ప సిద్ధి యాగం’ అశోక్‌రాజు తలపెట్టడం అభినందనీయమని అన్నారు. అశోక్‌రాజు మాట్లా డుతూ ధన్వంతరి యజ్ఞంతో దేశ ప్రజలందరికీ ఆరోగ్యం,ఐశ్వర్యం, ఆయుష్షు చేకూరుతాయని తెలిపారు.

తిరుప్పావడ ఉత్సవంలో అశోకరాజు దంపతులు

ధన్వంతరి హోమంలో కేంద్రమంత్రి మురుగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement